మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. ఈ రోజు సాయంత్రం 6.30 నిమిషాలకు కొత్త మంత్రులు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం ముగ్గురికి ఈ దఫాలో అవకాశం లభించింది. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ ఎమ్మెల్యే ఉత్తంకుమార్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ పేర్లు ఖరారైనట్టు తెలుస్తోంది. మూడో మంత్రిగా విప్ కొండ్రు మురళికి అవకాశం రావచ్చు. వరంగల్ జిల్లా నుంచి గండ్ర వెంకటరమణరెడ్డి చివరి వరకు ప్రయత్నించినా ఇప్పట్లో మంత్రి మండలిలోకి తీసుకోవడం కష్టమని సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. మరో వైపు కొత్త మంత్రుల చేరికతో పాత మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తమ శాఖలు మార్చొద్దని మంత్రులు ఇప్పటికే సీఎంకు నివేదించుకున్నారు. మంత్రులు సబిత, రాంరాడ్డి వెంకటరెడ్డి, బస్వరాజు సారయ్య ఈరోజు ఉదయం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.