ప్రభుత్వం పడిపోదన్న ధీమా వచ్చిన తర్వాతనే ప్రతిపక్షనేత చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. విశాఖ జిల్లాలోని అడ్డరోడ్డు సెంటర్‌లో మాట్లాడుతూ.. రైతులను పట్టించుకునే నాయకులే కరువయ్యారని అన్నారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న పెద్దలకు దిమ్మ తిరిగేలా బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో కుళ్లు, కుతంత్రాలతో కూడిన రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పేదవారి సంక్షేమాన్ని పట్టించుకునే నాయకుడే లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వైజాగ్ పర్యటనలో జగన్‌కు పోటాపోటిగా మహిళలు మంగళహారతులు పట్టారు. అడ్డరోడ్డు సెంటర్‌లోని సభకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. జగన్ ప్రసంగానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది.