కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు. భేటీలో మత్రి వర్గ విస్తరణ, ఉప ఎన్నికలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం. మంత్రి వర్గ విస్తరణలో ఒక్కరికి లేదా ఇద్దరికి అవకాశం దక్కనుందని సమాచారం. మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సారి మంత్రి వర్గ విస్తరణ తెలంగాణకే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది.