సీపీఎం రాష్ట్ర మహాసభల్లో తెలంగాణ అంశం చర్చించక పోవడం ప్రస్తామించక పోవడాన్ని అందరూ మరుతున్నా సీపీఎం పార్టీ వైఖరి మారకపోవడాన్ని హరీష్‌రావు ఖండించారు. 50 సంవత్సరాల సీపీఎం పార్టీ చరిత్రలో ఒక్క తెలంగాణ నాయకుడు కార్యదర్శి కాగల అర్హతలు లేవా అని ప్రశ్నించారు. ఇదే విదంగా సీపీఎం దోరణి ఉంటే తెలంగాణలో ఆ పార్టీ తుడిచిపెట్టుకపోతుందన్నారు. రాష్ట్రంలో మూడు నిరాహారదీక్షలు ఆరు ఆందోళనలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఖాళీగా ఉన్న 2000 హర్టీకల్చర్ పోస్టులను భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ లెక్చరర్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. కోస్తా ఆధిపత్యానికి కోమ్ముకాయడమే మార్క్సిజమా అని ప్రశ్నించారు.