రాష్ట్రంలో వివిధ అంశాలకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న సీబీఐ నూటికి నూరుపాళ్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టు భావిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామానారాయణరెడ్డి అన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాతే దోషులేవరనేది తేలుతుందని చెప్పారు. మంత్రుల పాత్ర ఉందని తేలితే కచ్చితంగా వారు శిక్షార్హులేనని ఆనం స్పష్టం చేశారు. సీబీఐ దర్యాప్తు ఇష్టంలేని ప్రతిపక్ష నేతలు స్టేల కోసం కోర్టులకు వెళుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.