రాష్ట్రంలో వివిధ అంశాలకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న సీబీఐ మంత్రులను వదిలేసి అధికారులను మాత్రమే వేధించడం సరికాదని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. తప్పులు జరిగివుంటే అందుకు మంత్రులు కూడా బాధ్యులేనని వ్యాఖ్యానించారు. మంత్రులను కూడా సీబీఐ విచారించాలన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను పదవుల నుంచి తప్పించాలన్నారు. ఐఏఎస్ అధికారులు తప్పులు చేస్తుంటే ప్రభుత్వం ఇన్నేళ్లుగా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మంత్రులు స్వలాభం కోసమే అధికారులను బలి పశువులు చేస్తున్నారని శంకర్రావు ఆరోపించారు.