సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా బీవీ రాఘవులు తిరిగి ఎన్నికయ్యారు. ఖమ్మంలో జరుగుతున్న సీపీఎం మహాసభల్లో ఆయనను రాష్ట్ర కార్యదర్శిగాఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాలుగోసారి రాష్ట్ర కార్యదర్శిగాఆయన ఎన్నికయ్యారు. 1997లో జరిగిన నల్లగొండ మహాసభలో కార్యదర్శిగా ఎన్నికైన రాఘవులు గత 15 సంవత్సరాలుగా అన్నీ తానే అయి పార్టీని నడిపిస్తున్నారు.