మహీంద్రా సత్యంకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆదాయపు పన్ను చెల్లించలేదనే నెపంతో తాత్కాలికంగా సత్యం భూములు, ఆస్తులను జప్తు చేయాలని ఆ శాఖ ఈమేరకు నోటీసులు ఇచ్చింది. సత్యం కుంభకోణం తరువాత 2003,04 నుంచి 2008-09 సంవత్సరాలకు చెల్లించాల్సిన 617కోట్ల ఆదాయ పన్ను విషయమై మహీంద్రా సత్యం ఐటి శాఖకు బ్యాంక్ గ్యారంటీ చూపించింది. అయితే ఆ కాలపరిమితి 2011 డిసెంబర్‌తో ముగిసిపోవడంతో మళ్ళీ ఐటిశాఖ నుంచి నోటీసులందుకున్నట్లు కంపెనీ తెలిపింది. రాష్ట్ర హైకోర్టు ఈ కేసును ఫిబ్రవరి 28వరకు వాయిదా వేయడంతో తదుపరి చర్యలు తీసుకుంటామని కంపెనీ ఆస్తులకు ఎలాంటి నష్టం లేదని మహీంద్రా అధికారులు తెలిపారు.