టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పోలీసులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేరస్థులను వదిలేసి సామాన్యులపై తమ లాఠీ ప్రతాపం చూపిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. జంట నగరాల్లో ఆటో కార్మికులను సిటీ పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఆటో డ్రైవర్స్ యూనియన్‌లో పాల్గొన్న ఆయన వారికి మద్దతుగా నిలిచారు.