తెలంగాణరాష్ట్ర ఆకాంక్షతో భారతీయ జనతాపార్టీ చేపట్టిన తెలంగాణ పోరు యాత్ర నల్లగొండకు చేరుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌డ్డి చేపట్టిన ఈ పోరుయాత్ర జనవరి 19న పాలమూరు జిల్లాలో ప్రారంభమైన యాత్ర తెలంగాణ జిల్లాల్లో కొనసాగుతూ శనివారం నల్లగొండ జిల్లా చేరుకుంది. తెలంగాణ ప్రాంతంలోని కృష్ణా, గోదావరి జలాలను వినియోగంలోకి తెచ్చి ప్రతిపప్లూకు సాగు, తాగునీరు అందించి తెలంగాణ సస్యశ్యామలం చేయడమే తమలక్ష్యమని పేర్కొంటుంది. ఉపాధి అవకాశాలు తెలంగాణలో అత్యధికంగా కల్పించడంతోపాటు పరిపాలన సౌలభ్యానికి, సత్వరవూపగతికి చిన్న రాష్ట్రాలే మేలని బీజేపీ పేర్కొంటుంది. కమిటీల కాలయాపన, చర్చల ద్వారా సాగదీయడం వంటిఅంతా ఉత్తిదేనని, తద్వారా కాంగ్రెస్ పార్టీ కాలం వెల్లదీస్తుందని బీజేపీ చిన్నరాష్ట్రాలకు కట్టుబడి ఉంది. అందులో భాగంగానే గతంలో 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసింది కూడా తమ పార్టీనేనంటూ అదేతరహాలో తమ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తామంటూ ముందుకు సాగుతుంది. తెలంగాణలో బీజేపీ బలోపేతం కూడా చేసుకోవాలన్నదే ఆ పార్టీ ఉద్దేశం. అందులో భాగంగా నల్లగొండ జిల్లాలో కూడా బీజేపీ గతంలో ఉన్నపట్టు కోల్పోయింది. ఒకప్పుడు నల్లగొండలో ఒక వెలుగు వెలిగిన ఆ పార్టీ ఆ పరిస్థితి నేడు లేదు. అయితే పూర్వవైభవం కోసం తిరిగి పూనుకుంది. అందులో భాగంగానే అంది వచ్చిన అవకాశాలను వదులుకోకుండా కృషి చేస్తుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరెళ్లి చంద్రశేఖర్ నేతృత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని గ్రామాల్లో కమిటీలను వేస్తుంది. దాదాపు 80 శాతం వరకు పూర్తి చేసింది. నవంబర్‌లో జాతీయ నాయకురాలు సుష్మాస్వరాజ్ సభ కూడా నల్లగొండలోనే నిర్వహించిన విషయం విధితమే. ఆ సభ ద్వారా నూతనొత్తేజాన్ని నింపుకున్న పార్టీ మరింత ముందుకు సాగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌డ్డి చేపట్టిన ఈ తెలంగాణ పోరుయాత్ర ద్వారా తెలంగాణ ప్రాంతంలో బీజేపీని బలోపేతం చేయాలన్నదే ఆ పార్టీ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా జిల్లాలో కూడా 4,5,6,7 తేదీల్లో బీజేపీ తెలంగాణ పోరుయాత్ర పేర కిషన్‌డ్డి పెద్దఎత్తున తిరగనున్నారు. 4వ తేదీ సాయంత్రం ఆలేరు, యాదగిరిగుట్ట మీదుగా భువనగిరి చేరుకుంటారు. రాత్రి అక్కడ బహిరంగ సభతో పాటు బసచేసి, చేనేత కార్మికులు, తదితర సమస్యలపై కూడా వారితో మాట్లాడనున్నారు. వలిగొండ, చౌటుప్పల్, నారాయణపురం, మర్రిగూడ, మాల్ మీదుగా రాత్రి దేవరకొండకు చేరుకోనున్నారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించడంతో పాటు పలువురితో కలిసి సమస్యలను కూడా ఆయన తెలుసుకోనున్నారు. 6వ తేదీన మల్లెపల్లి క్రాస్ రోడ్డునుంచి ప్రారంభమయ్యే రోడ్‌షో పీఏపల్లి, హాలి యా, త్రిపురారం, మిర్యాలగూడ, నేరేడుచర్ల మీదుగా గరిడేపల్లి, సూ ర్యాపేట, కోదాడ వరకు సాగుతుంది. రాత్రి అక్కడ బసచేస్తారు. మరుసటి రోజు ఉదయం కోదాడలో పలువురితో కలిసి జిల్లా సమస్యలపై చర్చించి 10గంటల తర్వాత ఖమ్మం జిల్లాకు పోరుయాత్ర వెళ్లనుంది. అయితే ఈ మూడు రోజుల తెలంగాణ పోరుయావూతలో జిల్లాలోని అనేక సమస్యలపై కూడా కిషన్‌డ్డి ప్రసంగించనున్నారు. మొత్తానికి ఈ తెలంగాణ పోరు యాత్ర ద్వారా జిల్లాపార్టీని మరింత బలోపేతం చేసేందుకు జిల్లా నాయకత్వం నడుం బిగించింది. అందులో భాగంగానే ఇప్పటికే అన్ని కమిటీలను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతుంది. పోరుయాత్ర జిల్లానేతల్లో మరింత ఉత్సాహాన్ని నింపనుంది.