టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేడు జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు జిల్లా కేం ద్రం లో తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఏ ర్పా టు చేసిన పార్టీ సిద్ధాంతకర్త, దివంగత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంత రం ఇక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు.
రామడుగు శిల్పులతో తయారీ..
తెలంగాణ జాగృతి సంస్థ, ప్రముఖ రామడుగు శిల్పులతో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని తయారు చేయించింది. దీనిని నగరంలోని మదీన కాంప్లెక్స్ ఎదుట ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈ చౌరస్తాకు ‘ప్రొఫెసర్ జయంశంకర్ చౌరస్తా’గా నామకరణం చేశారు.
మలిదశ ఉద్యమ ప్రకటన..
సకల జనుల సమ్మె తర్వాత మొదటిసారి జిల్లాకు వస్తున్న కేసీఆర్, జయశంకర్ విగ్రహావిష్కరణ తర్వాత, సభకు తరలిరానున్న వేలాది మంది అభిమానులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా మలిదశ తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని ప్రకటించే అవకాశముంది. మార్చి తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇప్పటికే వెల్లడించిన కేసీఆర్, ఈ వేదిక ద్వారా మరింత స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం దిగివచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహం, పార్టీపరంగా చేపట్టబోయే కార్యక్షికమాలతో పాటు శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
ఘనస్వాగతానికి ఏర్పాట్లు
విగ్రహావిష్కరణ అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ జాగృతి సంస్థ, కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసింది. అల్గునూరు చౌరస్తాలో విద్యార్థులు ఘన స్వాగతం పలుకుతారు. అభిమానులతో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఉన్న తెలంగాణతల్లి విగ్రహానికి చేరుకుని పూలమాలవేస్తారు. అక్కడి నుంచి తెలంగాణ అమరువీరుల స్థూపానికి వెళ్లి, శ్రద్ధాంజలి ఘటించాక సభాస్థలికి చేరుకుంటారు. ఈ మేరకు అడగడుగునా ఘనస్వాగతం పలికేందుకు జాగృతి అన్ని ఏర్పాట్లు చేసింది.
ఏర్పాట్ల పరిశీలన
కరీంనగర్ కల్చరల్: జిల్లా కేంద్రంలోని మదీనా కాంప్లెక్స్ ఎదుట ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ రాతి విగ్రహాన్ని, శనివారం కేసీఆర్ ఆవిష్కరించనుండగా, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం ఎమ్మెల్సీ నారదాసుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మధ్యాహ్నం ఒంటిగంటకు విగ్రహావిష్కరణ అనంతరం కళాకారుల ధూం ధాం కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ జాగృతి ఏర్పాటుకు జయశంకర్ తనను అన్ని విధాలా ప్రోత్సహించారని ఆమె గుర్తు చేసుకున్నారు. జయశంకర్ దిశానిర్దేశం ప్రకారమే జాగృతి అంచెలంచెలుగా విస్తరించిందని పేర్కొన్నారు. ఆయనను ఎప్పటికీ మరిచిపోలేనని కవిత పేర్కొన్నారు. జయశంకర్ విగ్రహాలు తెలంగాణ వ్యా ప్తంగా ఏర్పాటు చేస్తామనీ, ఆగస్టు 6న ఆయన జయంతి పురస్కరించుకొని ఏటా జాగృతి వార్షికోత్సవాలు జరుపుకుంటామని వెల్లడించారు. కవిత వెంట జాగృతి జిల్లా కన్వీనర్ తానిపర్తి తిరుపతిరావు, విద్యార్థి సమాఖ్య జిల్లా కన్వీనర్ పసుల చరణ్, టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంక సిద్ధం వేణు ఉన్నారు.
నమస్తే తెలంగాణా