తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వకుండా ఆన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ బిడ్డలకు తుపాకులు ఇస్తే సరిపోతుందని వాళ్లు నక్సలైట్లల్ల కలిసి వాళ్లే చుసుకుంటారని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఒక పక్క నీళ్లు ఇవ్వకుండా బోర్లు నిషేదించి సబ్సిడితో బిందు సేధ్యం అంటూ ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రికి తెలివి లేదని కేసీఆర్ విమర్శించారు. నీళ్లు లేకుండా బిందు సేధ్యమో.. బొంద సేధ్యమో ఎట్ల చేస్తారని కేసీఆర్ మఖ్యమంత్రిని ప్రశ్నించారు.