ఎమ్మార్ కేసులో అరెస్ట్ అయిన ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య గురువారం చంచలగూడ జైల్లో అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్రమైన తలనొప్పితో ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోవటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించనున్నారు. కాగా ఆచార్యకు ఈనెల 15 వరకూ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.