హైదరాబాద్ గండిపేట చెరువులో గురువారం అయిదుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతు అయిన మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సరదాగా గండిపేటకు వెళ్లిన విద్యార్థులు మృత్యువాత పడటంతో బాధితు కుటుంబాల్లో విషాదం నెలకొంది.