దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. పట్టణంలోని పెలివియన్ గ్రౌండ్‌లో సీపీఎం 23వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రకాశ్ కారత్ మాట్లాడుతూ.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఈ సభలకు బృందకారత్, రాఘవులు, సీపీఐ నారాయణ హాజరయ్యారు. ఖమ్మం పట్టణమంతా ఎరుపెక్కి పోయింది.