హైదరాబాద్ నగరం నుంచి మేడారం సమక్క, సారక్క జారతకు మొత్తం 3150 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు తెలిపారు. జారతకు వెళ్ళే భక్తుల కోసం సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసింది. ఉప్పల్ క్రాస్ రోడ్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి ప్రతి అరగంటకు ఓ బస్సు వెళుతుంది. 6వ తేదీ నుంచి 11వరకు ఈ బస్సులు ఉదయం 6గంటల నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ వాహనాలను జాతరకు దాదాపు 6 కిలోమీర్ల దూరంలోని నార్లాపూర్‌పూర్ గ్రామం వరకే అనుమతిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు మాత్రం నేరుగా సమక్క-సారమ్మ గద్దెల వరకు వెళుతున్నాయి. హైదరాబాద్ నుంచి వెళ్ళే లగ్జరీ బస్సుల్లో పెద్దలకు రూ.260, పిల్లలకు రూ.130 చార్జీ వసూలు చేయనున్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా టికెట్లు బుక్‌చేసుకోవచ్చునని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ పురుషోత్తంనాయక్ సూచించారు.