తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న దీక్ష తొమ్మిదో రోజుకు చేరింది. దీక్ష చేస్తున్న జూడాల పరిస్థితి విషమించడంతో వారిని ఐసీయూకు తరలించారు. ఐసీయూలో కూడా దీక్ష కొనసాగిస్తున్నారని సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. వీరికి మద్దతుగా మరో 12 మంది జూడాలు బుధవారం మధ్యాహ్నం నుంచి దీక్షకు కూర్చున్నారు. వీరిలో ఇద్దరు మహిళా జూడాలు ఉన్నారు. జూడాల సమస్యలపై ఇవాళ అఖిలపక్ష నేతలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలవనున్నారు. సీఎం మాటతీరు తమకు సానుకూలంగా ఉండకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృ్ధతం చేస్తామని జూడాలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నేడు నిర్ణయం తీసుకుంటామని జూడాలు తెలిపారు.