శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి తెలంగాణ ఎమ్మెల్సీ పట్ల వివక్ష చూపిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆమోస్ ఆరోపించారు. చక్రపాణి అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ మండలి ఎథిక్స్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీల పదవులకు ఆయన రాజీనామా చేశారు. సీఎంకు తెలిసే ఈ కమిటీల ఏర్పాటు జరిగిందని మండలి ఛైర్మెన్ చెప్పడం అర్థరహితమన్నారు. తెలంగాణ సమస్యలపై మండలిలో తమ గళం విన్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.