తెలంగాణలో బస్సు యాత్ర - కోదండరాం
తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బస్సుయాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ జేఏసీ ఛైర్మెన్ కోదంరాం ప్రకటించారు. ఇతర పార్టీలపై నెపం నెట్టి తెలంగాణపై తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు . ఈ నెల 15న ఓయూలో జరగనున్న విద్యార్థి గర్జన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను గెలిపించేందు ఈ యాత్ర చేస్తున్నట్లు తెలంగాణ స్టూడెంట్స్ జేఏసీ ప్రకటించింది. తెలంగాణ కోసం మార్చి 27 న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక్క రోజు దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు.