రేణిగుంట మండలం గుత్తివారిపల్లెలోని చెరువులో లభించిన మృతదేహం భానుది కాదని రేణిగుంట డీఎస్పీ నాయక్ తెలిపారు. మృతదేహం భానుదే అని వస్తున్న వార్తలు అవాస్తవం అని చెప్పారు. కేవలం వదంతులు మాత్రమే అని స్పష్టం చేశారు. మృతదేహం ఆకారం చూస్తే భాను శరీరాకృతిల కనిపించడం లేదని తెలిపారు. అయితే మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉందని సమాచారం. మద్దెల చెర్వు సూరి హత్య కేసులో భాను నిందితుడు. గత కొన్ని రోజులుగా భాను పరారీలో ఉన్నారు.