రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల డిమాండ్‌లను పరిశీలించేందుకు ప్రభుత్వం మంత్రి వర్గ ఉస సంఘాన్ని ఏర్పాటు చేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, శైలజానాథ్, గీతారెడ్డిలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే తమ ఉపకార వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ 11 ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు జూడాలు ఉంచారు. జూడాలు చేస్తున్న ఆందోళనలు, నిరాహార దీక్షలు రోజు రోజుకు తీవ్రతరం అవుతుండటంతో తక్షణమే వారి డిమాండ్లపై పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని కమిటీని ఆదేశించింది.