గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు మోహరించారు. ప్రధాన గేటు మూసివేశారు. దాంతో రోగులు ఆస్పత్రి లోపలకు వెళ్లడానికి ఇబ్బందులుపడుతున్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మె 8వ రోజుకు చేరింది. ఈరోజు వాళ్లు 'ఛలో హైదరాబాద్' పిలుపు ఇచ్చారు. దాంతో రాష్ట్రం నలుమూలల నుంచి జూనియర్ డాక్టర్లు హైదరాబాద్ చేరుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా గాంధీ ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు.
ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సంఘం నేతలు మాట్లాడుతూ ఇంత మంది పోలీసులు ఇక్కడికి రావడం, ఈ చుట్టూ వారి వాహనాలు
ఉండటంతో యుద్ధవాతావరణాన్ని తలపిస్తోందన్నారు. పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్ధం కావడంలేదన్నారు. రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.