కోటి మంది భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క - సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. సమ్మక్క - సారలమ్మ జాతరను అధికారికంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. సీఎంతో పాటు తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డీకే అరుణ కూడా సందర్శనకు రానున్నారు. మేడారంలో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మేడారంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను భారీగా మోహరించారు.