ఇవాళ ఉదయం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన ఘటనకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. టీడీపీ నేత దాడి వీరభద్రరావుకు సీఎం ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునారవృతం కావని సీఎం హామీ ఇచ్చారు. దీంతో దీక్ష చేసే యోచనను దాడి విరమించుకున్నారు. ఉదయం క్యాంపు కార్యాలయం వద్ద సీఎంను కలవడానికి వెళ్లిన దాడి వాహనాన్ని సెక్యూరిటీ లోపలికి అనుమతించలేదు. దీంతో అసహనానికి గురయిన దాడి తనకు జరిగిన అవమానాన్ని సీఎం పేషీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. చేసేదేమీ లేక ఆయన అక్కణ్నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.