విచారణలో ఉన్నవారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించామన్నది అవాస్తవమని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయన మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వివేదితో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ విచారణ జరుగుతున్న కేసులపై వారు చర్చించినట్లు సమాచారం.
అనంతరం జేడీ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ కేసుల విచారణలో ప్రభుత్వం నుంచి మరికొంత సహకారం, సమన్వయాన్ని కోరినట్లు తెలిపారు. కొన్ని పత్రికల్లో ఊహాజనిత, కల్పిత వార్త కథనాలు వస్తున్నాయని, సీబీఐ విచారణాంశాలను ఎవరికీ లీక్ చేయటం లేదని స్పష్టం చేశారు.