గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న మంగళవారానికి ఏడో రోజు చేరింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నలుగురి జూడాల పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం ఐసీయూకు తరలించారు. మరో ఇద్దరు మాత్రం దీక్ష కొనసాగిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తే ఆందోళన మరింత ఉద్ధక్షుతం చేస్తామని జూడాలు హెచ్చరించారు. ఎంసీఐ నిబంధనల ప్రకారం ఉపకార వేతనాలు చెల్లించాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు.