రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎని 5.99 శాతం పెంచడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈరోజు ఇక్కడ జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వ్యాట్ పెంపు ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపారు. చిత్తూరు జిల్లాలో డిఆర్డిఎకు 11 ఎకరాలు, అనంతపురం జిల్లాలో బిడిఎల్ కంపెనీకి 44 ఎకరాలు, నెల్లూరులో శిల్పారామం ఏర్పాటుకు 7 ఎకరాలు కేటాయించారు. అంబేద్కర్ విగ్రహాల ధ్వంసంపై కూడా సమావేశంలో చర్చించారు.