పల్వంచ పట్టణంలో సర్వేనంబర్ 817లో ఉన్న ప్రభుత్వ భూమిలో గత కొద్ది రోజులుగా గిరిజనులు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. గుడిసెలు తొలగించాలని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా గిరిజనులు అక్కడినుంచి గుడిసెలు తొలగించలేదు. ఈ రోజు ఉదయం మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది సంయుక్తంగా గుడిసెలు తొలగించడానికి వికలాంగుల కాలనీకి వెళ్లారు. అధికారులు తెచ్చిన జేసీబీపై పోలీసులపై గిరిజనులు ఎదురుతిరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో ఒక మహిళ సృహతప్పింది. అధికారుల తీరును నిరసిస్తూ గిరిజనులు ఆందోళనకు దిగారు.