కరీంనగర్‌ను 'మన నగరం'గా అభివృద్ధి చేస్తున్నారు. దాతల సాయంతో 22 ముఖ్యకూడళ్లను నిర్మిస్తున్నారు. నగరంలో ఐదు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నీ 45రోజుల్లో పూర్తి కావాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలు జారీచేశారు. ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నగరంలోని మానేర్ పాత వంతెనపై జిల్లాకు చెందిన మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు.