యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఘటనల వెనుక బయట వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కార్మికుల దాడిలో మృతిచెందిన రీజెన్సీ వైఎస్ చైర్మన్ కేసీ చంద్రశేఖర్ భౌతికకాయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ చంద్రశేఖర్ మృతిపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.