వ్యాట్‌కు నిరసనగా రాష్ర్టంలో వస్త్ర వ్యాపారుల ఆందోళన కొనసాగుతోంది. ఆదివారం ఇందిరా పార్క్ వద్ద వస్త్ర వ్యాపారులు నిర్వహించిన ఆందోళనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. వ్యాపారులకు సంఘీభావంగా ఆయన అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పెంచిన వ్యాట్‌ను తగ్గించకపోతే ప్రభుత్వ నేతల బట్టలూడదీస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి దమ్ముంటే మద్యం సిండికేట్లలో ఉన్న నాయకులపై చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు.