ఖమ్మం జిల్లా గార్ల మండలం బడితండాలో విషదం చోటుచేసుకుంది. కరెంటు బిల్లు కట్టాలని విద్యుత్ అధికారుల బెదిరింపులు తాళలేక దంపతులు ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. వీరులో భార్య మరణించగా భర్త పరిస్థితి విషమంగా ఉంది. విద్యుత్ అధికారులపై చర్య తీసుకోవాలని ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తు బందువులు పోలీస్‌స్టేషన్ ముందు బైటాయించారు.