వరుసగా జరిగిన అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం మరువక ముందే.. తాజాగా తెనాలిలో ఎన్జీ రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. కవిరాజు పార్కులోని వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.